పోరుమామిళ్ల తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల ఇష్టారాజ్యం ఉదయం 11:30 దాటినా రాని డిటి.ఎండలో ప్రజల అల్లాటప్పా!

పోరుమామిళ్ల, ఆగస్టు 01 ప్రజావాణి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరును పక్కాగా అమలు చేయాలని ఆదేశిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. కడప జిల్లా పోరుమామిళ్ల మండల రెవెన్యూ కార్యాలయం (తహశీల్దార్ ఆఫీస్)లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. శనివారం ఉదయం 11:30 గంటలు దాటినా కార్యాలయానికి డిప్యూటీ తహశీల్దార్ (DT) రాకపోవడంతో, వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది.పనుల కోసం వచ్చి.పడిగాపులు కాస్తూ.మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, సామాన్య...