పోరుమామిళ్ల ఉన్నత పాఠశాలలో నరకం: చేతులు కడుక్కునే స్థలమా లేక రోగాల నిలయమా? అధ్వాన్నంగా మారిన ప్రాంగణం.నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు!

కడప జిల్లా ప్రజావాణి జూన్ 16 పోరుమామిళ్ల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.చదువుల తల్లి నిలయం కావాల్సిన పాఠశాల,నేడు విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడే మురికికూపంగా మారింది.కనీస మౌలిక వసతులు కల్పించడంలోనూ,పరిశుభ్రతను పాటించడంలోనూ పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు ఘోరంగా విఫలమయ్యారు.పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత చేతులు కడుక్కునేందుకు ఏర్పాటు చేసిన ఉమ్మడి కుళాయిల  ప్రాంతం అత్యంత దయనీయంగా మారింది. చేతులు కడుక్కునేందుకు కనీసం ఒక్క కుళాయిలో కూడా నీరు రాకపోవడం గమనార్హం. నీటి సరఫరా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర...