పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండులో వివక్ష! ప్రయాణికులకు ఉక్కపోత.. అధికారులకు చల్లగాలి,

పోరుమామిళ్ల బస్టాండులో ప్రయాణికులకు చుక్కెదురు: కదులుతున్న ‘ఎంక్వయిరీ’ ఫ్యాన్.. కదలని అధికారుల గుండెలు!  వైఎస్ఆర్ జిల్లా (ప్రజావాణి జూన్ 21) పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.ఎండల తీవ్రతతో బస్టాండుకు వచ్చే ప్రయాణికులు అల్లాడిపోతుంటే,వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.బస్టాండు ప్రయాణికుల వెయిటింగ్ హాల్‌లో ఫ్యాన్లు తిరగడం లేదు. కానీ,ఎంక్వయిరీ రూమ్ (విచారణ గది) లో మాత్రం ఫ్యాన్లు నిరంతరాయంగా తిరుగుతుండటం గమనార్హం.ఈ వివక్షపై స్థానిక ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉక్కపోతతో ప్రయాణికుల నరకం...