పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్‌లో తాగునీటి కొరత… ప్రయాణికుల ఇబ్బందులు
కడప జిల్లా ప్రజావాణి న్యూస్,(ఏప్రిల్ 29) పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ చుట్టుపక్కల ఉన్న అంగళ్లలో లూజ్ వాటర్ లేదా వాటర్ ప్యాకెట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చాలా అంగళ్లలో కేవలం వాటర్ బాటిల్స్ మాత్రమే విక్రయిస్తున్నారని వారు చెబుతున్నారు. రోజువారీ కూలీలు, విద్యార్థులు, వృద్ధులు,పేద కుటుంబాలకు చెందిన ప్రయాణికులు బాటిల్స్ కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న ఈ సమయంలో...