పోరుమామిళ్లలో వైష్ణవి ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం: ఆర్మీ జవాన్‌కు తీవ్ర గాయాలు, యాజమాన్య నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
పోరుమామిళ్ల, జూలై 10:ప్రజావాణి పట్టణంలో వైష్ణవి ప్రైవేట్ విద్యాసంస్థల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధంగా, సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకుని అతివేగంగా దూసుకొచ్చిన శ్రీ వైష్ణవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు గురువారం పట్టణ కేంద్రంలో బీభత్సం సృష్టించింది. స్కూల్ యాజమాన్యం మరియు డ్రైవర్ యొక్క బాధ్యతారాహిత్యం కారణంగా ఓ ఆర్మీ జవాన్ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న అత్యంత దౌర్భాగ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు మరియు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శ్రీ వైష్ణవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు...