పోరుమామిళ్లలో వైభవంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు: ఘన నివాళులర్పించిన హ్యూమన్ రైట్స్ నేషనల్ జాయింట్ సెక్రెటరీ కవలకుంట్ల మధు బాబు
పోరుమామిళ్ల ( ప్రజావాణి జులై 08):తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జన్మదిన వేడుకలు (జయంతి) వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లలో బుధవారం ఘనంగా జరిగాయి. వైఎస్సార్ అభిమానులు, స్థానిక నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ వేడుకలలో హ్యూమన్ రైట్స్ నేషనల్ జాయింట్ సెక్రెటరీ కవలకుంట్ల మధు బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు.వైఎస్సార్ స్వర్ణ విగ్రహానికి పూలమాల వేసి,చేతులు జోడించి భక్తిశ్రద్ధలతో అంజలి ఘటించారు. అనంతరం ఆయన సమక్షంలో...