పోరుమామిళ్లలో వృద్ధాప్య పింఛన్ దారునికి తప్పని రేషన్ తిప్పలు: డీలర్ నిర్వాకంపై సర్వత్రా ఆగ్రహం!

కడప జిల్లా పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 29) మండల కేంద్రంలోని గిరి నగర్  కాలనీలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగుచూసింది. నడవలేని స్థితిలో ఉన్న 82 ఏళ్ల దళిత వృద్ధుడు బొజ్జ ఐజయ్యకు రేషన్ బియ్యం అందకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతీ ఇంటికీ రేషన్ పంపిణీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వృద్ధులకు నరకం కనిపిస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది.కదిలిస్తే కన్నీరు.షాపుల చుట్టూ తిరగలేక అల్లాడుతున్న వృద్ధుడు వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బొజ్జ ఐజయ్య, రేషన్...