పోరుమామిళ్లలో ఫుట్‌పాత్‌లు మాయం: డ్రైనేజీలపై అక్రమ కట్టడాలు.చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు!నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ‘కవలకుంట్ల మధు బాబు’ తీవ్ర ఆగ్రహం
1200 మీటర్ల మెయిన్ రోడ్డుపై నరకప్రాయమైన ప్రజా ప్రయాణం! అధికారుల ‘ముడుపుల’ వేటలోనే అనుమతులు ఇచ్చారా? టౌన్ ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం! నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ‘కవలకుంట్ల మధు బాబు’ తీవ్ర ఆగ్రహం.పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక! పోరుమామిళ్ల,జూలై 28 ప్రజావాణి కడప జిల్లాలోని ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఎదుగుతున్న పోరుమామిళ్ల మండల కేంద్రంలో అక్రమ కట్టడాల జోరు ప్రజా ప్రాణాల మీదకు తెస్తోంది. రంగసముద్రం మరియు పోరుమామిళ్ల మేజర్ పంచాయతీల పరిధిలోకి వచ్చే సుమారు 1200 మీటర్ల పొడవున్న...