పోరుమామిళ్లలో పెట్రోల్ కొరత తీవ్రం… వాహనదారులకు ఇబ్బందులు

వైయస్సార్ కడప జిల్లా ప్రజా వాణి న్యూస్ (ఏప్రిల్20) పోరుమామిళ్ల పట్టణంలో పెట్రోల్ కొరత రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. రెండు రోజులుగా పెట్రోల్ బంకుల్లో సరఫరా సరిగా లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన వారు కూడా బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.పట్టణంలోని ఎస్‌ఆర్ పెట్రోల్ పంపుల్లో ఆన్లైన్ సమస్య కారణంగా ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు యాజమాన్యం చెబుతోంది. మరోవైపు హెచ్పీ పెట్రోల్ పంప్‌లో పూర్తిగా స్టాక్ లేకపోవడంతో వాహనదారులు...