prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 2:10 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోరుమామిళ్లలో పల్స్ పోలియో కార్యక్రమం: పాల్గొన్న బద్వేల్ మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ సుప్రజ


పోరుమామిళ్ల: (జూన్ 28 ప్రజావాణి) స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో బద్వేల్ మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ సుప్రజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ.ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలందరికీ తల్లిదండ్రులు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.పోలియో మహమ్మారి బారిన పడకుండా మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు.రెండు చుక్కల మందు జీవన రక్షణ’అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి,ఈ అవగాహనను అందరికీ చేరవేయాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలు,మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.