పోరుమామిళ్లలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం: చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన డాక్టర్ శ్రీవిద్య
పోరుమామిళ్ల (ప్రజావాణి న్యూస్ జూన్ 28) మండలం పరిధిలోని రంగసముద్రం-1 కేంద్రంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా,విజయవంతంగా నిర్వహించబడింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ పిలుపు మేరకు మండల వ్యాప్తంగా ఉన్న 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో రహిత భవిష్యత్తును అందించే లక్ష్యంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.రంగసముద్రం-1 లోని స్థానిక పోలియో కేంద్రంలో (ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో) డాక్టర్ శ్రీవిద్య స్వయంగా పాల్గొని,చిన్నారులకు నోటి ద్వారా రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ వేసి...