prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 4:36 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోరుమామిళ్లలో ఘనంగా‘వి.బి.జి రాంజీ’పథకం ప్రారంభోత్సవం,మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ నాగేంద్ర

* ఉపాధి హామీ స్థానంలో కేంద్ర ప్రభుత్వ విప్లవాత్మక నూతన చట్టం
* పనిదినాలు 100 నుండి 125 రోజులకు పెంపు:  

పోరుమామిళ్ల, జూలై 02 ప్రజావాణి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల ఆర్థిక బలోపేతం కోసం ప్రవేశపెట్టిన విప్లవాత్మక నూతన పథకం‘వి.బి.జి రాంజీ’ (వికసిత్ భారత్ -గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ -గ్రామీణ్) పోరుమామిళ్లలో ఘనంగా ప్రారంభమైంది.స్థానిక ‘శ్రీ శక్తి భవనం’లో గురువారం జరిగిన ప్రత్యేక అవగాహన సమావేశానికి బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ నాగేంద్ర ముఖ్య అతిథిగా హాజరై,పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ సుప్రజ నాగేంద్ర మాట్లాడుతూ,దశాబ్దాలుగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత ఆధునికీకరిస్తూ,దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ సరికొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని తెలిపారు.నిరుపేద కుటుంబాల సంక్షేమం,గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ఈ నూతన చట్టం యొక్క ముఖ్య లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.పథకం యొక్క ముఖ్య ప్రయోజనాలు పని దినాల పెంపు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి సంవత్సరంలో కల్పించే ఉపాధి పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం జరిగింది.పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా రోజువారీ కనీస వేతనాన్ని కూడా ప్రభుత్వం గణనీయంగా పెంచింది.శాశ్వత ఆస్తుల కల్పన ఈ పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు మరియు శాశ్వత కమ్యూనిటీ ఆస్తుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తారు.అర్హులందరికీ లబ్ధి ప్రభుత్వ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా చేరవేసేందుకు అధికారులు నిరంతరం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం,సామాజిక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు.ప్రజల సహకారంతో మరింత జవాబుదారీతనంతో సేవలు అందిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు,వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు,ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.