పోరుమామిళ్లలో అభివృద్ధి పేరిట విధ్వంసం: చిన్న వ్యాపారుల పొట్ట గొడుతున్న అధికారులు!
పోరుమామిళ్ల,జూన్ 14 ప్రజావాణి పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే గాంధీ బొమ్మ రోడ్డు సెంటర్లో డ్రైనేజీ పనుల పేరుతో అధికారులు సాగించిన కూల్చివేతలు స్థానిక చిన్న వ్యాపారులను రోడ్డున పడేశాయి.కూల్చివేతలు సరే.నిర్మాణం ఎప్పుడు?"కూల్చడం సులువు.కట్టడం కష్టం"అన్న చందంగా మారింది ఇక్కడి అధికారుల తీరు.డ్రైనేజీ కోసం షాపులైతే పడగొట్టారు కానీ,అసలు ఆ డ్రైనేజీ ఎప్పటి వరకు పూర్తి చేస్తారనే దానిపై అధికారుల వద్ద స్పష్టమైన కార్యాచరణ లేదు.పనులు సగం ముక్కగా వదిలేసి,ఎంతవరకు డ్రైనేజీ కట్టాలో కూడా సరిగ్గా తేల్చకుండా,ఇప్పుడు ప్రజలను మరియు వ్యాపారులను "సహకరించాలి"అని కోరడం...