పోచారం 8వ డివిజన్‌లో కొర్రెముల, వెంకటాపూర్ లో  కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ, ఎస్‌ఐఆర్ ఓటర్ అవగాహన సదస్సు విజయవంతం

పోచారం, జూలై 16: పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకటాపురం, కొర్రెముల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) అవగాహన కార్యక్రమం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్రె రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ...