పోచారం, జూలై 16: పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకటాపురం, కొర్రెముల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) అవగాహన కార్యక్రమం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.
డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్రె రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడం కార్యకర్తల బాధ్యత అని అన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ ఐకమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యటన సందర్భంగా గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, పెన్షన్లు, రేషన్, గృహాలు తదితర సమస్యలను పరిశీలించి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల కృష్ణారెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ నర్రి శ్రీశైలం, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు ఎర్ర రాజు, మాజీ మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవి, నిరుడు కుమార్ ముదిరాజ్, బైండ్ల జంగయ్య, పాలడుగు అమరేందర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, బద్దం నరసింహారెడ్డి, చుంచు నర్సింహ, నాగేష్ గౌడ్, నర్సింగ్ ముదిరాజ్, భోజరెడ్డి, భాస్కర్ రెడ్డి, సందీప్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, ముద్దం ఈశ్వర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ కుమార్తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.