పోచారం డివిజన్‌లో బీజేపీ కార్యవర్గ సమావేశం విజయవంతం.. రానున్న ఎన్నికల్లో పోచారంలో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేసిన జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్

ఘట్‌కేసర్, జూలై 20: భారతీయ జనతా పార్టీ పోచారం డివిజన్ కార్యవర్గ సమావేశం పోచారం డివిజన్ అధ్యక్షుడు నానావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన అన్నోజిగూడలోని శివాస్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచారం డివిజన్‌లో నాయకులు, కార్యకర్తల ఉత్సాహం, కృషిని చూస్తుంటే రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని విశ్వాసం...