పోచారం డివిజన్‌లో ఘనంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘట్‌కేసర్ : జనగామ శాసనసభ్యులు, మాజీ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను పోచారం డివిజన్‌లో మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను చేపట్టి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. సింగపూర్ టౌన్‌షిప్‌లోని ఆగాపే అనాథ పిల్లల ఆశ్రమంలో నోట్‌బుక్స్ పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. అలాగే ఉచిత వైద్య శిబిరాలు, క్రీడా పోటీలు నిర్వహించారు. యమ్నంపేటలోని శ్రీ వెంకటేశ్వర...