పోచారం డివిజన్‌లో కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: కర్రే రాజేష్
ఘట్‌కేసర్, జూలై 10: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశం చౌదరిగూడలో ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రే రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్రే రాజేష్ మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త సమస్య తన సమస్యేనని పేర్కొన్నారు. డివిజన్‌లోని ప్రతి గ్రామాన్ని సందర్శించి కార్యకర్తలు, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ...