పోచారం డివిజన్‌లో ఐమాక్స్ లైట్ల మరమ్మతులు వేగవంతం
ఘట్కేసర్, మే 19: ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్‌లో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. డివిజన్‌లో దాదాపు 61 ఐమాక్స్ లైట్లు పనిచేయకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఘట్కేసర్ మండల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, ఘట్కేసర్ సర్కిల్ డీసీ వాణి మేడం సహకారంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే మరమ్మతు పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. పోచారం డివిజన్‌లో విలీనమైన ఐదు గ్రామాలలో చౌదరిగూడ, కొర్రేముల మెయిన్ రోడ్‌తో పాటు...