ఘట్కేసర్, మే 19: ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్‌లో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. డివిజన్‌లో దాదాపు 61 ఐమాక్స్ లైట్లు పనిచేయకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను గుర్తించిన ఘట్కేసర్ మండల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, ఘట్కేసర్ సర్కిల్ డీసీ వాణి మేడం సహకారంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే మరమ్మతు పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.
పోచారం డివిజన్‌లో విలీనమైన ఐదు గ్రామాలలో చౌదరిగూడ, కొర్రేముల మెయిన్ రోడ్‌తో పాటు కాలనీలలోని ఐమాక్స్ లైట్ల మరమ్మతు పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాత్రి వేళల్లో సరిపడా వెలుతురు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని వినోద్ తెలిపారు.
