prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 3:24 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

పోచారంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పోచారం, ఏప్రిల్ 27 ( ప్రజావాణి ):    బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పోచారం ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కొండల్ రెడ్డి, రెడ్డినాయక్, బద్దం జగన్మోహన్ రెడ్డి, అబ్బా వతిని నరసింహ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.

యువ నాయకులు అబ్బవతిని నరసింహా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమం, పేదల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో పార్టీ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు “జై తెలంగాణ… జై బీఆర్ఎస్!” అంటూ నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.