prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 7:00 am Digital Edition : RAJASHEKARREDDY

పోచమ్మ తల్లి పునఃప్రతిష్ట వేడుకలు ఘనంగా నిర్వహణ

పోచమ్మ తల్లి పునఃప్రతిష్ట వేడుకలు ఘనంగా నిర్వహణ

బెజ్జంకి, ఏప్రిల్19(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి పునఃప్రతిష్ట కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆరాధన, వాస్తు క్షేత్ర పాలన, మండపారాధన, అగ్ని ప్రతిష్టాత్మక హోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, సర్పంచ్ ఎర్రల జానకి, ఉప సర్పంచ్ చింతపల్లి పద్మ, నిర్మల్ రెడ్డి, కచం వెంకటేశం, వార్డ్ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ యొక్క
కార్యక్రమం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.