పోగొట్టుకున్న లక్ష రూపాయలు నగదు సొమ్మును ఇచ్చి నిజాయితీని చాటుకున్న అర్చకులు సాయిరాం

ఎన్టీఆర్ జిల్లాప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) నందిగామ మండలం గొల్లమూడి శివాలయంలో పోగొట్టుకున్న లక్ష రూపాయలు నగదు సొమ్మును ఇచ్చి నిజాయితీని చాటుకున్న అర్చకులు సాయిరాం అర్చకులు సాయిరాం నిజాయితీకి ఫిదా.డబ్బులు,విలువైన వస్తువులు దొరికితే తమ సొంతం చేసుకుంటారుగానీ,పోగొట్టుకున్న వ్యక్తులకు వాటిని అప్పగించాలని ఆలోచించరు.వాటిని చూడగానే మనిషి ప్రవర్తన మారిపోతుంది.కానీ,కొందరు మాత్రం తమది కానిది ఒక్క రూపాయి కూడా ఆయాచితంగా తీసుకోడానికి ఇష్టపడరు.పరుల సొమ్ముకు ఆశపడకుండా ఆత్మాభిమానంతో ఉంటారు.తాజాగా,అలాంటి సంఘటన గురువారం సాయంత్రం నందిగామ శివారు గ్రామీణ ప్రాంతంలో చోటుచేసుకుంది నందిగామ మండలం రాగాపురం నివాసి...