prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 3:00 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోగొట్టుకున్న నగదును సీసీ కెమెరాల సాయంతో గుర్తించి బాధితుడికి అందజేత – వ్యక్తి నిజాయితీని అభినందించిన ఇన్స్పెక్టర్ కే. రమణ రెడ్డి

కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్16):మైదుకూరు పోగొట్టుకున్న నగదును సీసీ కెమెరాల సాయంతో గుర్తించి బాధితుడికి అందజేతవ్యక్తి నిజాయితీని అభినందించిన ఇన్స్పెక్టర్ కే.రమణ రెడ్డి.మైదుకూరు పట్టణంలో మానవత్వం మరియు నిజాయితీ వెల్లివిరిసిన ఘటన చోటుచేసుకుంది.బద్వేల్ రోడ్డులో పొరపాటున 20 వేల రూపాయల నగదును పోగొట్టుకున్న వ్యక్తికి,పోలీసులు మరియు ఒక సామాన్య పౌరుడి చొరవతో ఆ సొమ్ము తిరిగి చేరింది.పట్టణంలోని మదీనా మసీదు వీధి 4వ లైనుకు చెందిన అమీర్ అనే వ్యక్తికి బద్వేల్ రోడ్డులో 20 వేల రూపాయల నగదు లభించింది.ఆ నగదును తన వద్దే ఉంచుకోకుండా, వెంటనే మైదుకూరు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఇన్స్పెక్టర్ శ్రీ కే.రమణ రెడ్డి గారికి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు.సీసీ కెమెరాల కీలక పాత్ర:డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి ఎవరో గుర్తించే క్రమంలో పట్టణంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. కెమెరాల ద్వారా సదరు వ్యక్తిని గుర్తించి,పోలీసు స్టేషన్‌కు పిలిపించి అమీర్ చేతుల మీదుగా ఇన్స్పెక్టర్ గారు ఆ నగదును బాధితుడికి అందజేశారు.ఇన్స్పెక్టర్ గారి సందేశం:ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కే. రమణ రెడ్డి గారు మాట్లాడుతూ.డబ్బులు దొరికిన వెంటనే పోలీసులకు అప్పగించిన అమీర్ యొక్క ఉదార స్వభావాన్ని, నిజాయితీని ప్రత్యేకంగా అభినందించారు.నేరాల నియంత్రణలో మరియు ఇలాంటి సంఘటనల్లో బాధితులకు న్యాయం చేయడంలో సీసీ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.ప్రజలందరూ తమ పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.తమ నగదు తిరిగి దక్కడంతో బాధితుడు అమీర్‌కు మరియు పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేశారు.కె.రమణా రెడ్డి ఆఫ్ పోలీస్ మైదుకూరు అర్బన్ పీఎస్.