పొలిట్ బ్యూరో సభ్యులుగా దగ్గుమళ్ళ ప్రసాదరావు ఎంపిక చిత్తూరు ఎంపీకి లభించిన అరుదైన గౌరవం
చిత్తూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16)రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావుకు తెలుగుదేశం పార్టీ అత్యున్నత నిర్ణయాధికార మండలి అయిన పొలిట్ బ్యూరోలో స్థానం లభించింది. ఈ మేరకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. రాజకీయాల్లో అనూహ్యంగా అడుగుపెట్టి, భారీ మెజారిటీతో ఎంపీగా విజయం సాధించిన దగ్గుమళ్ళకు ఈ పదవి దక్కడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.రాజకీయాల్లోకి అడిగిన ఐఆర్ఎస్ అధికారి ఆయన దగ్గుమల్ల ప్రసాదరావు మొదటిసారి చిత్తూరు పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి భారీ...