పొరుమామిళ్ల ప్రభుత్వ కాలేజీల్లో దాహార్తి! – లక్షల రూపాయలు వెచ్చించినా విద్యార్థులకు దక్కని ‘ఆర్వో’ భాగ్యం
గత ప్రభుత్వ హయాంలో ఫిట్టింగ్ పూర్తి.. నేటికీ దక్కని ఓపెనింగ్ మోక్షం తాళాల వెనకాలే బందీ అయిన స్వచ్ఛమైన నీరు.అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆగ్రహం పొరుమామిళ్ల ప్రజావాణి జూన్ 16 ప్రభుత్వ విద్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని,విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తామని గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రగల్భాలు పలికిన‘మనబడి నాడు-నేడు’(ప్రస్తుతం [మన బడి మన భవిష్యత్తు]పథకం క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతోంది.ప్రజాధనం లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన మౌలిక వసతులు.అధికారుల పర్యవేక్షణ లోపం,రాజకీయ ఉదాసీనత వల్ల నిరుపయోగంగా మారుతున్నాయి. దీనికి సజీవ సాక్ష్యమే...