prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 9:58 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పొదిలి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఘనంగా స్నేహితుల దినోత్సవం 

స్నేహం అనేది మాటల్లో చెప్పలేనిది. మనసుతో అనుభవించేది. జీవితాంతం నిలిచేది.

 మనసులో పుట్టి మట్టిలో కలిసిపోయేంతవరకు ఉండేదే స్నేహం 

పొదిలి ఆగస్టు 2 ప్రజావాణి జూనియర్ కాలేజీ గ్రౌండ్లోఈరోజు ఉదయం నవ్వులు పువ్వుల సంఘం అధ్యక్షులు షేక్ మదార్ వలి ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం జరిగినది ఈ సందర్భంగా మదార్ వలి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి ఆదివారంలో స్నేహితుల దినోత్సవం జరుపుకుంటామని, స్నేహితులు తమ స్నేహితులపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి పువ్వులు, కార్డులు, మణికట్టు బాండ్లు వంటి వాటిని ఇచ్చుకుంటారని, స్నేహం అనేది మాటల్లో పుట్టి చూపులతో మొదలయ్యేది కాదని,మనసులో పుట్టి మట్టిలో కలిసిపోయేంతవరకు తోడుగా ఉండేదే స్నేహం అని తెలిపారు,సభ్యులందరూ ఒకరికి ఒకరు ఆలింగము చేసుకొని మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో సభ్యులు మదార్ వలి, గోవిందయ్య,భాషా మొహిద్దిన్,ఎండి జిలాని, సుబ్రహ్మణ్యం, ట్యాంక్ ఈ జిలాని,అల్లూరయ్య,మీరావలి, చంద్రమౌళి,లక్ష్మణ,ప్రసాద్ మరియు గ్రౌండ్ లోకి వచ్చిన చిన్న పిల్లలు కూడా పాల్గొన్నారు