పైడిపల్లిలో ఆయిల్ పామ్ మొదటి గెలల కోత ప్రారంభించిన, ఉద్యానవన అధికారి వంశీ కృష్ణ

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ మే 11 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో సోమవారం ఆయిల్ పామ్ సాగులో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఉద్యానవన విస్తరణ అధికారి వేముల వంశీ కృష్ణ సమక్షంలో రైతులు జైన అభినవ్, గంగుల నగేష్‌కు చెందిన తోటల్లో మొదటి ఆయిల్ పామ్ గెలల కోతను ఘనంగా ప్రారంభించారు. 2022-23 సంవత్సరంలో నాటిన వివిధ ఆయిల్ పామ్ తోటలను ఈ సందర్భంగా అధికారులు సందర్శించారు. పైడిపల్లిలో 2.20 ఎకరాల్లో సాగు చేస్తున్న అభినవ్, నగేష్‌ల తోటలను...