ప్రేమ పెళ్లి పేరుతో మోసం… యువతి ఆత్మహత్యప్రేమ పెళ్లి పేరుతో మోసం… యువతి ఆత్మహత్య.
తవణంపల్లి మే 30 ప్రజావాణి : తవణంపల్లి మండలంలోని చారాల హెచ్ డబ్ల్యు గ్రామంలో యువకుడు ప్రేమ, పెళ్లి పేరుతో మోసం తో అదే గ్రామానికి చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా మండలంలోని చారాల హెచ్ డబ్ల్యు గ్రామానికి చెందిన సంధ్య వయస్సు 50 సంవత్సరాలు, భర్త లేట్ రమేష్ కూతురు కావ్య వయసు 24 సంవత్సరాలు, అదే గ్రామానికి చెందిన త్యాగరాజు కుమారుడు విక్కీ అనే నిందితుడు ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు. అనంతరం ఇద్దరూ పరస్పరం ప్రేమించుకుంటూ కొనసాగారు. కొద్ది రోజుల తర్వాత నిందితుడు విక్కీ ఆమెను తప్పకుండా వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. గత ఆరు నెలలుగా వీరి ప్రేమ వివాహం విషయమై మృతురాలు ఒత్తిడి చేస్తూ ఉండగా నిందితుడు వివిధ కారణాలతో కప్పిపుచ్చుతూ తప్పించుకుంటూ వచ్చాడు. మరియు ఆ విషయమై శనివారం ఉదయం 9:30 గంటలకు మృతురాలు ఎప్పటిలాగే వివాహం గురించి నిందితుడిని నిలదీసింది. అయితే నిందితుడు ఆమెను దూరం చేసుకోవాలని ఉద్దేశంతో, ప్రస్తుతం ఆమెను వివాహం చేసుకోవాలని తేల్చి చెప్పాడు. ఆమెకు నచ్చినట్లు వివాహం చేసుకోవచ్చని లేదంటే చనిపోవాలనుకుంటే చనిపోవచ్చని ఆమెతో చెప్పినట్లు తెలిసింది. నిందితుడు తెలిపిన సమాధానంతో మృతురాలు కావ్య తీవ్ర మనస్థాపానికి గురై తన ఇంటిలోని పైకప్పు హుక్ కు తన దుప్పటితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం ఈ విషయాన్ని గమనించిన ప్రియాది దారులు అజయ్ మరియు ఇతరులు ఇంటి ప్రధాన తలుపును బలవంతంగా తెరిచి మృతురాలిని క్రిందికి దింపి వెంటనే చికిత్స నిమిత్తం ఆటో రిక్షాలో అరగొండ అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ విషయమై కేసు నమోదు చేయడమైనది ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు తెలిపారు.