పేరుకే మున్సిపాలిటీ.. అడిగితే నచ్చినోడికి చెప్పుకోమనే సిబ్బంది! బద్వేల్‌లో బరితెగించిన పారిశుధ్య విభాగం
బద్వేల్ జూలై 07 ప్రజావాణి"లక్షల రూపాయలు పన్నులు కడుతున్నాం.కనీస సౌకర్యాలు కల్పించరా?"అని ప్రశ్నించినందుకు,"నీ బుద్ధి పుట్టిన వాళ్లకు చెప్పుకో."నీకు నచ్చినోడికి కంప్లైంట్ చేసుకో.మేము చెత్త ఎత్తము!"అంటూ బద్వేల్ మున్సిపల్ కింది స్థాయి సిబ్బంది బహిరంగంగానే ప్రజలపై దౌర్జన్యానికి దిగుతున్నారు.బద్వేల్ మున్సిపాలిటీలో పారిశుధ్య వ్యవస్థ ఎంతలా భ్రష్టు పట్టిందో చెప్పడానికి నెల్లూరు రోడ్డులో చోటుచేసుకుంటున్న ఉదంతాలే నిదర్శనం.ఏళ్ల తరబడి పేరుకుపోయిన మురికి.పట్టించుకోని అధికారులు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్డు మెయిన్ రోడ్డు వెనుక భాగంలో ఉన్న దొడ్డి వాకిళ్లలో సంవత్సరాలుగా మురికి,చెత్తాచెదారం పేరుకుపోయి నరకాన్ని...