పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి బాబు జగజ్జీవన్ రాం ఆశయ సాధన సమితి సేవలు 16 గ్రామాల్లో 485 మంది విద్యార్థులకు ఉచిత విద్యా సామగ్రి పంపిణీ

కడప జిల్లా (మే15)  ప్రజావాణి న్యూస్ బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు,పోరుమామిళ్ళ,కాశినాయన,బి.కోడూరు మండలాల్లో విద్యా చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో బాబు జగజ్జీవన్ రాం ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో విశేష కార్యక్రమం నిర్వహించబడింది. మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు చదువుతున్న 16 గ్రామాలకు చెందిన 485 మంది పేద విద్యార్థిని, విద్యార్థులకు తెలుగు,ఇంగ్లీష్,హిందీ ప్రింటెడ్ కాపీ రైటింగ్ పుస్తకాలు,ఎక్కాల పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు సగిలి జాకోబ్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తో పాటు సంఘ సభ్యులు పాల్గొని విద్యార్థులకు...