పేదవారి సొంతింటి కల నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే –ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
బెజ్జంకి,జూన్ 22 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో కొందరు లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో, వారి స్థానాల్లో అర్హులైన కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి మొత్తం 76 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదవారి సొంతింటి కలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. ఎన్నికల హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి...