prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 6:56 am Digital Edition : VIJAYKUMAR SIDDIPET

పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

సిద్దిపేట జిల్లా, మార్కుక్, ప్రజావాణి

దమార్కుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి మాట్లాడుతూ.గజ్వేల్ నియోజకవర్గంలో 3.వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.ముఖ్యంగా మహిళా సాధికారత లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించగా మహిళా మహిళల చేతుల్లోనే కుటుంబ ఆర్ధిక స్థితిలో బాగుంటాయనే లక్ష్యంతో ప్రభుత్వ పథకాలను మహిళల పేరిటనే కేటాయిస్తున్నట్లు చెప్పారు అలాగే కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు పాత కార్డులలో సభ్యులను చేర్చి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అంతే కాకుండా పంట రుణమాఫీ రైతు భరోసా. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు.500 కే గ్యాస్ సిలిండర్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. సర్పంచ్ నర్సింలు,ఉపసర్పంచ్,వర్డ్ సభ్యులు సీనియర్ నాయకులు గ్రామ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.