పేదల పాలిట వరంగా సీఎం సహాయనిధి.. 12 మందికి చెక్కుల పంపిణీ
బొమ్మనపల్లి సర్పంచ్ కొంకట మౌనిక చక్రధరి
మన ప్రజావాణి ప్రతినిధి, చిగురుమామిడి:
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధిని మంజూరు చేస్తోందని బొమ్మనపల్లి గ్రామ సర్పంచ్ కొంకట మౌనిక చక్రధరి అన్నారు. చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం రోజున నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చేతుల మీదుగా 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మౌనిక చక్రధరి మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఒక వరంలా నిలుస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ సహాయాన్ని పొందాలని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హ కుటుంబానికి సీఎం సహాయనిధి మంజూరయ్యేలా నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాసర్ల హరీష్, వార్డు సభ్యుడు, డీసీసీ కార్యదర్శి బడుకోలు దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మాచమల్ల రమణయ్య, కార్యదర్శి మడమడకల రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వేముల నాగరాజు, వార్డు సభ్యులు సుకోషి పద్మ, కొంకట బిక్షపతి, అందె సంపత్, కాంగ్రెస్ నాయకులు బద్దిపడిగే మల్లిఖార్జున్ రెడ్డి, మాచమల్ల కిషోర్, మామిడి శ్రీను, కత్తుల రాజయ్య, మామిడి రాజు, ఓర్సు సమ్మయ్య, వీరగోని అజయ్, యాంసాని వీరేశం, అల్లెపు సురేష్, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.