prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 7:42 am Digital Edition : SRIKANTH MULUGU

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి .గోవిందరావుపేటలో 30 మంది లబ్ధిదారులకు 12.90 లక్షల చెక్కులు.


పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి
.గోవిందరావుపేటలో 30 మంది లబ్ధిదారులకు 12.90 లక్షల చెక్కులు.
.గోవిందరావుపేట మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ.

అనారోగ్యంతో సతమతమవుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద ఊరటగా నిలుస్తోంది.

తేది: 25.07.2026 శనివారం నాడు గోవిందరావుపేట మండలంలోని వివిధ గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన 30 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ నిర్వహించారు.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు ఈ చెక్కుల పంపిణీ జరిగింది.
మొత్తం 12,90,500/- రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు నిజమైన వరం అని అన్నారు.
పెరుగుతున్న వైద్య ఖర్చులను పేదలు భరించలేని పరిస్థితిలో ఈ నిధి వారికి ఆసరాగా నిలుస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోందని పేర్కొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఎవరూ డబ్బు లేక వైద్యం ఆపుకోవద్దని, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి,
చల్వాయి గ్రామ అధ్యక్షులు వేల్పుగొండ ప్రకాష్,
సర్పంచ్ లు జోగా నాయక్, బానోత్ నిర్మల – వెంకన్న, లకావత్ జమ్మిలాల్,
ఉపసర్పంచ్ పెండెం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.