మార్కాపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (మే12) సింగరాయకొండ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పేకాట జూదం వంటి వ్యసనాలతో జేబులు ఖాళీ చేసుకుంటూ జీవితాలను చెడు మార్గం పడుతున్న వారిని సన్మార్గంలో పెట్టేందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు ఆదేశాలతో జిల్లా టాస్క్ ఫోర్స్ సింగరాయకొండ పోలీసు స్టేషన్ పరిధిలో పేకాట శిబిరాల పై దాడులు చేపట్టింది. టాస్క్ ఫోర్స్ కి అందిన సమాచారం మేరకు ఇంచార్జి సి ఐ భీమా నాయక్ పర్యవేక్షణ లో ఎస్సై చెంచయ్య తో పాటు టాస్క్ ఫోర్స్ బృందం సోమరాజుంపల్లి లోని పేకాట శిబిరం పై ఆకస్మిక దాడి చేపట్టారు. దాడి సందర్భంగా పేకాట రాయుళ్ల తోపాటు జూదంలో పెట్టిన సుమారు అరవై అయిదు వేల రూపాయలు,10 సెల్ ఫోన్లను టాస్క్ ఫోర్స్ బృందం స్వాధీనం చేసుకుంది.పేకాట ఆడుతున్న 10 మంది రాయుళ్ల పై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎక్కడైనా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జూదం,గంజాయి డ్రగ్స్ రవాణా,నిల్వ ఉంచేవారి సమాచారం తెలిస్తే ఆసమాచారాన్ని డైల్ 112,లేక 9121102266 కి సమాచారం ఇవ్వాలని అలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇలాంటి నేరాల నియంత్రణ లో పోలీస్ కి ప్రజల సహకారం ఉండాలని టాస్క్ ఫోర్స్ బృందం ప్రజలను కోరింది