పేకాట గ్యాంగ్‌పై పోలీసుల రైడ్ – ఆరుగురు అరెస్ట్ రూ 5,550నగదు, బైక్ సీజ్

మంగళగిరి రూరల్ ప్రజావాణిన్యూస్(మార్చి26) పేకాట చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు,ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్హె చ్చరించారు.మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న కాకాని గ్రామ శివారు ప్రాంతాల్లో పేకాట నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంపై మంగళగిరి రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు.గ్రామ పొలాలు శివారు,ఎన్నారై బ్యాక్‌సైడ్ ఖాళీ ప్రదేశాల్లో కొంతకాలంగా పేకాట సాగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి...