పేకాట, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్‌పై కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు
ప్రజావాణిన్యూస్(మార్చి22)ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీసులు పేకాట, కోడి పందాల స్థావరాలు,క్రికెట్ బెట్టింగ్‌లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఈ ప్రత్యేక దాడులలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగి, ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆధునిక సాంకేతికతను వినియోగించారు. అందులో భాగంగా డ్రోన్ కెమెరాలను సమర్థవంతంగా ఉపయోగిస్తూ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, పొలాలు, చెట్లతో కప్పబడి ఉండే ప్రాంతాలు మరియు సులభంగా గుర్తించలేని రహస్య ప్రదేశాలలో నిర్వహిస్తున్న పేకాట, కోడి...