ప్రజావాణిన్యూస్(ఏప్రిల్13)హైదరాబాద్‌లో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పరిచయమై,తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించి ఓ యువతి కుటుంబాన్ని మోసం చేయబోయిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు.పెళ్లి పేరుతో రూ.1.5 కోట్ల కట్నం డిమాండ్ చేసి,నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ కేటుగాడి బండారం ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో జరిగిన వేధింపులతో బయటపడింది.ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.హైదరాబాద్‌కు చెందిన పనస మధు (30) ప్రముఖ మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ వివరాలతో ప్రొఫైల్ సృష్టించాడు.తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సి ఐ)లో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్‌గా చర్లపల్లిలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు.ఈ క్రమంలో నల్గొండకు చెందిన ఓ యువతి ప్రొఫైల్ చూసి ఆమెను సంప్రదించాడు.మాటలతో నమ్మించి, ఆమె కుటుంబాన్ని కలిసి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తన ఉద్యోగాన్ని నిరూపించేందుకు నకిలీ ఐడీ కార్డు కూడా చూపించడంతో వారు నిజమని నమ్మారు.యువతి కుటుంబం ఆర్థికంగా స్థితిమంతులని గ్రహించిన మధు,తొలుత రూ.2 కోట్ల కట్నం డిమాండ్ చేశాడు.చివరకు ఇరు కుటుంబాల మధ్య చర్చల అనంతరం రూ. కోటిన్నరకు ఒప్పందం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది.అయితే,ఇటీవల ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో యువతిని హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఉన్న ఓ గదికి పిలిపించిన మధు,ఆమెను అనుమానిస్తూ తీవ్రంగా వేధించాడు. అతని ప్రవర్తనతో భయపడిన యువతి,ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో అనుమానం వచ్చిన వారు మధు ఉద్యోగం గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అతను ఎఫ్ సి ఐ ఉద్యోగి కాదని తేలడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మధును ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వినే వాళ్ళు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు.మోసం,దగా చేస్తాడు. అది పసిగట్టినవారు బయటపడతారు. పసిగట్ట ని వారు మోసగాడి చేతిలో మోసపోతూనే ఉంటారు.అలాంటిదే ఈ సంఘటన.ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో అమాయకులైన యువతులపై కేటుగాళ్లు వలవేసిరి మోసం చేస్తూనే ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ఏదో సంఘటన జరిగినప్పుడు మేమున్నాం.అంటూ బూట్ల చప్పుళ్ళు చేసుకుంటూ వస్తారు.నిఘా వ్యవస్థల వైపల్యంతోనే ఈ విధమైన సంఘటనలు తరచూ జరుగుతున్నాయి.కానీ అటు నిఘా వ్యవస్థలు గాని పోలీసు వ్యవస్థ గాని ఇలాంటి సంఘటనలపై కఠినమైన చర్యలు తీసుకొనకపోవడంతో కేటుగాళ్ల పని మూడు పూలు ఆరు కాయలుగా తయారైపోయింది.కనీసం సంఘటనలు జరిగినప్పుడైనా ఆయా అధికార యంత్రాంగం కేటుగాళ్లపై కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంటే మరొకరు ఈ విధంగా చేసేందుకు భయపడేవారు అలాంటిది ఏమీ లేకపోవడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని పలువురు వాపోతున్నారు.