prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 12:44 pm Digital Edition : PRAJA VANI

పెర్కిట్‌లో గ్రామదేవతలకు ఘనంగా గంగాజలాభిషేకం

*పెర్కిట్‌లో గ్రామదేవతలకు ఘనంగా గంగాజలాభిషేకం*

ఆర్మూర్ టౌన్, జూలై 19(మన సమగ్ర ప్రజావాణి):

ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్ గ్రామంలో ఆదివారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు గంగాజలాలతో ప్రత్యేక జలాభిషేకం నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవతలకు నైవేద్యాలు సమర్పించి గ్రామ శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థనలు చేశారు. ప్రతి ఏడాది గ్రామ శ్రేయస్సు, వ్యవసాయాభివృద్ధి కోసం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.