prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 7:46 am Digital Edition : PRAJA VANI

పెరిగిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలి ఎండిగా నగేష్

పెరిగిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలి ఎండిగా నగేష్

నడి కూడా ప్రజావాణి జులై 18

నడికూడ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించి రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని నడికూడ మండలానికి చెందిన రైతు ఎండిగా నగేష్ డిమాండ్ చేశారు. ఇప్పటికే వ్యవసాయ వ్యయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఎరువుల ధరల పెంపు రైతులపై అదనపు ఆర్థిక భారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎరువుల కంపెనీలకు లాభం చేకూరే విధంగా ధరలను పెంచడం వల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎరువుల ధరలను పెంచడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.

అలాగే, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు అనుగుణంగా రైతులకు పంట రుణాలు పూర్తిస్థాయిలో అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన వ్యవసాయ పెట్టుబడి సకాలంలో అందితేనే సాగు సజావుగా సాగుతుందని, ప్రభుత్వం రైతుల సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని ఎండిగా నగేష్ కోరారు.