prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 3:28 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పెన్నా ఆపరేషన్ విజయవంతం

వైయస్సార్ జిల్లా వల్లూరు ఆపరేషన్ పెన్నా విజయవంతం..పోలీస్, ఫైర్ సమన్వయంతో – యువకుల మృతదేహాల వెలికితీత కన్నీరు మిగిలింది అంటున్నా తల్లితడ్రులు ఎస్సై శివ నాగిరెడ్డి నేతృత్వంలో శోధన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో – సమన్వయ చర్యలు వల్లూరు మండల పరిధిలోని పుష్పగిరి పెన్నానది వద్ద ఆదివారం చోటుచేసుకున్న విషాద ఘటనలో మునిగిపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలను పోలీసులు అగ్నిమాపక సిబ్బంది స్థానిక జాలర్లుతో సాహసోపేతంగా సోమవారం సాయంత్రం వెలికితీశారు,ఈ రక్షణ చర్యలను ఆపరేషన్ పెన్నా అన్నట్టుగా నిర్వహించారు.ఆదివారం మధ్యాహ్నం కొండాపురం మండలం గండ్లూరు గ్రామానికి చెందిన పోలు శ్రీనాథ్, కడప అశోక్ నగర్ నివాసి పాలంపల్లి సాయి చైతన్య, కొర్రపాడు గ్రామానికి చెందిన సురేంద్ర లు ముగ్గురు స్నేహితులు సరదాగా నీటిలో దిగేందుకు వెళ్లారు.ముందుగా ఆదినిమాయపల్లి ఆనకట్ట వద్ద పోలీసులు నీటిలో దిగవద్దని హెచ్చరించడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు అనంతరం పుష్పగిరి పెన్నానది వద్ద ఎండ తీవ్రతలో నీటిలో దిగగా అక్కడ ఉన్న సుడిగుండాలకు ఇద్దరు యువకులు చిక్కుకుని మునిగిపోయారు..మరో యువకుడు అదృష్టవశాత్తూ బయటపడి స్థానికుల సహాయంతో సమాచారం అందించాడు,విషయం

తెలిసిన వెంటనే వల్లూరు ఎస్సై శివ నాగిరెడ్డి తన పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని శోధన చర్యలు ప్రారంభించారు.నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ సుడిగుండాల మధ్య చిన్న బోటుతో సాహసోపేతంగా గాలింపు చేపట్టారు.జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో కడప డిఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు మరింత వేగవంతమయ్యాయి.కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ సమన్వయం చేయగా కమలాపురం అగ్నిమాపక సిబ్బంది నిరంతరంగా సహకరించారు.ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమైన గాలింపు చర్యలు సోమవారం సాయంత్రం వరకు కొనసాగి చివరకు ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికితీశారు,కన్నీరు మిగిలింది అంటూ తల్లితడ్రులు కుటుంబ సభ్యులు ఏడువగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై శివ నాగిరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మా పోలీసు సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది డ్రోన్ ఆపరేటర్లు సమన్వయంతో శోధన చేపట్టామని తెలిపారు.జిల్లా ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం వల్లె చాకచక్కంగా వెలికి తీశామని అన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రమాదకర ప్రాంతాల్లో నీటిలో దిగకూడదని సూచించారు.