prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 8:02 pm Digital Edition : SRIKANTH MULUGU

పెద్ది మరణం తీరని లోటు

 

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎం. ఎల్. ఏ. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ కు తీరని లోటని ఉద్యమకారుల ఫోరమ్ ములుగు జిల్లా అధ్యక్షులు మురహరి బిక్షపతి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2001 లో కెసిఆర్ పిలుపు మేరకు ఉద్యమం లో చేరి రాష్ట్రము వచ్చేవరకు నిరంతరం పోరాడిన ధీరుడు అని కొనియాడారు.. జడ్పీటీసీ గా మొదలు పెట్టి ఎం ఎల్ ఏ గా కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించి అనతి కాలం లోనే మంచి పేరు సంపాదించడమే కాకుండా, అందరితో కలిసి మెలిసి ఉండడం ఆయన ప్రత్యేకత అని అన్నారు.. ఉద్యమకారుల పరిస్థితి చూసి చలించిన ఆయన సభ లో మొదటిసారి వారిని ఆదుకోవాలని వారి సంక్షేమం గురించి పట్టించుకోవాలని ప్రభుత్వం ను కోరి ఉద్యమకారుల హృదయం లో నిలిచిపోయారు..అండగా నిలిచి అనతి కాలం లోనే దూరమవడంతో తీవ్ర ఆవేదన కు గురవుతున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు జిల్లా ఉద్యమకారుల తరపున సంతాపాన్ని తెలియచేస్తూ, మనోదైర్యం ప్రసాధించాలని కోరుతున్నామన్నారు..