కడప జిల్లా (మే15) ప్రజావాణి న్యూస్ కడప కార్యదర్శి జి.చంద్రశేఖర్ పెరిగిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలపై “ప్రెస్ నోట్” విడుదల చేశారు.పెట్రోల్, డీజిల్,లీటర్ పై రూ.3లు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడాన్ని సిపియం కడప జిల్లా కమిటీ ఖండిస్తున్నదని తెలిపారు.పెంచిన ధరలను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమన్నారు.గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపియం కోరుతున్నద అన్నారు.దేశంలో సరిపడా చమురు నిల్వలున్నాయని ఇప్పటిదాకా నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు పూర్తికాగానే చమురు ధరలు పెంచడం ప్రజలను వంచించడమేనని,మోదీ పొదుపు చర్యలు ప్రకటించడానికి అసలు కారణం ధరల పెంపుదలకోసమేనని.ఇప్పటికే వంట గ్యాస్ రూ.50లు కమర్షియల్ గ్యాస్ దాదాపు రూ.1000లు పెంచడం వలన సామాన్య మధ్యతరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు,హోటళ్ళు మూతపడి ఉపాధిలేక ప్రజలు అవస్థలు పడుతున్నారని.ఇప్పుడు చమురు ధరలు పెంచడం వలన రవాణా రంగంపై పెనుభారం పడనుందని ఇప్పటికే పిరమైన నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయని,అంతిమంగా పేద ప్రజలు ధరలు భారం మోయవలసి వస్తుందని,రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని ఒత్తిడితీసుకురావాలని, ఇదే సందర్భంలో కె.జి.బేసిన్ లో ఆయిల్,గ్యాస్ రాష్ట్రానికి 50% వాటా పొందేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని,రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతోంది. సమస్యను అధిగమించడానికి దీర్ఘకాలంలో రాష్ట్రానికి,ప్రజలపై భారం పడకుండా మేలు జరుగుతుందని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను ఉపసంహరించాలని సిపియం కడప జిల్లా కమిటీ కోరుతున్నదని తెలిపారు