శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (మే17 ప్రజావాణి) పెట్రోల్ డీజిల్ ధరల నియంత్రణలో వైఫల్యం చెందిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిఆధ్వర్యంలో నెల్లూరు సిటీ పరిధిలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని పెంచిన పెట్రోల్, డీజిల్,రేట్లు వెంటనే తగ్గించాలని కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారుపెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా రిక్షా తొక్కుకుంటూ కలెక్టర్ కార్యాలయం కి చేరుకున్న శాసనమండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు కేవలం అధికారాన్ని అనుభవించడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల పక్షాన నిలబడి వారికి అన్ని విధాలా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం ప్రజలకు వచ్చే కష్టసుఖాల్లో, కష్టనష్టాల్లో మేము ఎల్లప్పుడూ భాగస్వాములం అవుతాం.కూటమి ప్రభుత్వం రూ. 3,391 కోట్ల భారం ఉపసంహరించుకునే వరకు అలుపెరగని పోరాటం చేస్తాం-ప్రజలపై మోపిన సుమారు రూ.3,391 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు,చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఆ నిర్ణయాన్ని ఉపసంహరింపజేసే విదంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుంది- ఎన్నికల సమయంలో ప్రజలకు నమ్మబలికి, అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగచాటుగా జీవోలు తెస్తూ, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రజలను వంచించడమే- ఇంధన ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాదు,దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతాయి- పెరిగిన రేట్ల వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను పూర్తిగా అస్తవ్యస్తం చేస్తుంది-
వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, ఇతర యంత్రాలకు డీజిల్ వినియోగం చాలా ఎక్కువ, ధరల పెంపు వల్ల ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతాంగంపై మరింత అదనపు భారం పడుతుంది- గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇదే లోకేష్ బాబు పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి ధరల బోర్డుల ముందు సెల్ఫీలు దిగి రాజకీయం చేశారు- ఈరోజు వారి కూటమి ప్రభుత్వంలో అసలు పెట్రోల్ బంక్ వైపు వెళ్లడానికే భయపడేలా ధరల మంట పుట్టిస్తున్నారు.- ఇంధన ధరలను నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.- కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి సామాన్యులకు ఉపశమనం కలిగించాలి- నెల్లూరు జిల్లా లో ప్రస్తుత ధర డీజల్ లీటరుకు ₹100.77 పైసలు, కాగా పెట్రోల్ ధర ₹113.14 పైసలు వసూలు చేస్తున్నారు దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక ధరలు ఉన్నాయి ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు “తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తాం” అని స్పష్టమైన హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించారు- పెట్రోల్ ధరపై దాదాపు 31% వ్యాట్ (VAT) వసూలు చేస్తున్నారు. దీనికి తోడు లీటరుకు అదనంగా ₹4 మరియు రోడ్ సెస్ కింద మరో ₹1 వసూలు చేస్తున్నారు. డీజిల్ ధరపై 22.25% వ్యాట్వి ధిస్తున్నారు.దీనిపై కూడా అదనంగా ₹4 మరియు రోడ్ సెస్ కింద ₹1 చొప్పున వసూలు చేస్తున్నారు. “పెరిగిన ధరల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వ్యాట్ శాతాన్ని తగ్గించుకుంటుందో, లేక అదనంగా వసూలు చేస్తున్న ₹4 ఉపసంహరించుకుంటుందో, లేదా రోడ్ సెస్ భారాన్ని తగ్గిస్తుందో అది ప్రభుత్వ ఇష్టం. ఏ రకంగానైనా సరే సర్దుబాటు చేసి సామాన్యుడిపై భారం పడకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, లోకేష్‌తో సహా ప్రభుత్వ పెద్దలంతా తాము కాన్వాయ్‌లను తగ్గించుకున్నామని, పొదుపు పాటిస్తున్నామని ప్రజలను భ్రమింపజేస్తున్నారు కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి పెంచిన పన్నులను,ఇంధన ధరలను తగ్గించకపోతే ప్రజలను భాగస్వామ్యం చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం