పెట్రోల్, డీజిల్ పై ఆందోళన అవసరం లేదు: తహసిల్దార్ రమాదేవి

ప్రకాశం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) దొనకొండ మండలంలోని తహసిల్దార్ బి రమాదేవి సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ రామకృష్ణ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ఐదు పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీజిల్, పెట్రోల్ కోసము వాహనదారులు ఆందోళన చందనవసరం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ బంకులను పరిశీలించి పెట్రోల్, డీజిల్ నిలువల వివరాలను సేకరించారు. ఈ మేరకు పెట్రోలు బంకుల యజమానులకు పలు సూచనలు చేశారు. పెట్రోలు, డీజిల్ వాహనాలకు మాత్రమే పోయాలని డబ్బాలకు మాత్రం పోయవద్దని ఆదేశించారు....