prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 1:42 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పెట్రోల్, డీజిల్ పై ఆందోళన అవసరం లేదు: తహసిల్దార్ రమాదేవి

ప్రకాశం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) దొనకొండ మండలంలోని తహసిల్దార్ బి రమాదేవి సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ రామకృష్ణ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ఐదు పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీజిల్, పెట్రోల్ కోసము వాహనదారులు ఆందోళన చందనవసరం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ బంకులను పరిశీలించి పెట్రోల్, డీజిల్ నిలువల వివరాలను సేకరించారు. ఈ మేరకు పెట్రోలు బంకుల యజమానులకు పలు సూచనలు చేశారు. పెట్రోలు, డీజిల్ వాహనాలకు మాత్రమే పోయాలని డబ్బాలకు మాత్రం పోయవద్దని ఆదేశించారు. పెట్రోలు, డీజిల్ కొరత లేకుండా నిలువలను త్వరితగతిన తెప్పించుకోవాలని సూచించారు. సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ పెట్రోలు బంకులు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలోని పెట్రోల్ బంకులలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తో పాటు పోలీస్ సిబ్బందిని ఉంచడం జరిగినదని తెలిపారు. వీరి వెంట రెవెన్యూ శాఖ సిబ్బంది పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు