పెట్రోల్ డీజిల్ ధరల పెంపును ఖండిస్తూ నంద్యాలలో భారీ శాంతియుత ర్యాలీ…వైసీపీ
నంద్యాల (మే 17 ప్రజావాణి) నూనెపల్లె ఉదయానంద రెసిడెన్సి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ శాంతియుత నిరసన ర్యాలీ సాగింది,రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైసిపి శ్రేణులు సమరశంఖం పూరించాయి.నంద్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు.ఎన్నికల సమయంలో ఇంధన ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.అధికారంలోకి వచ్చాక ప్రజలపై అదనపు భారాన్ని మోపడాన్ని వైసిపి తీవ్రంగా ఖండించింది.మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర...