పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి : ఎమ్మెల్యే డా. దాసరి సుధ
బద్వేల్ (మే18 ప్రజావాణి)-పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బద్వేల్ ఆర్డీవోకు ఎమ్మెల్యే దాసరి సుధా వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారుతుందని తెలిపారు.ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని...