prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 10:42 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని వైఎస్ఆర్సిపి నాయకులు నిరసన..ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ ధ్వజం.

సత్యవేడు మే17 ప్రజావాణి సత్యవేడు మండలంలో వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.Y.జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు,సత్యవేడు వైస్సార్సీపీ పార్టీ సమన్వయ కర్త శ్రీ.నూకతోటి రాజేష్ పిలుపు మేరకు,వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ.నిరంజన్ రెడ్డి జిల్లా యువజన కార్యదర్శి బెల్ట్ రమేష్ గార్ల ఆధ్వర్యంలో వైస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు”కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని”నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.వైస్సార్సీపీ నాయకులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత వైస్సార్సీపీ పార్టీ పాలనా కాలంలో యువగళం పేరుతో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మంత్రి గానున్న లోకేష్ మేము అధికారంలోకి వస్తే పెట్రోల్,డీజిల్ రేట్లను తగ్గిస్తామని అబద్ధపు హామిలిచ్చి మన దేశంలో ఎక్కడా లేని రేట్లను మన రాష్ట్రoలో అమలు పరుస్తున్నారు. దీనినే సంపద సృష్టి అంటారేమోనని ప్రజలు వాపోతున్నారు.ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజలను ముగ్గురు సంతానం ఉంటే Rs.30,000 లు,నలుగురు పిల్లల్ని కంటే Rs.40,000 ఇస్తాం లాంటి హామిలివ్వడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రజలే చర్చించుకుంటున్నారు.రాష్ట్ర ప్రజలపై భారం మోపకుండా పెంచిన పెట్రోల్,డీజల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు. బాలాజీ రెడ్డి.బుజ్జి రెడ్డి,ఎంపీటీసీలు శరవణ,బాలయ్య,రాబిన్, సుధాకర్,పునిదకుమార్,మోహన్ రెడ్డి,గురునాధం,సర్పంచ్ లుశేఖర్మధు,రాజు,ఆనంద్,కనకరాజ్,చెంచయ్య,నాయకులు.రవి,సురేష్,గోపాల్రెడ్డి,జీవయ్య,పళని,సోము,ధనపాల్,రాజేష్,చంద్రబాబు,ఈశ్వరయ్య,సురేంద్రరెడ్డి,నాగరాజు,దయాల్,డేవిడ్, రాము,ఇస్మాయిల్, సాహుల్,రమేష్, బాబు,రవి,గోపి, మహిళా నాయకురాలు మస్తానీ, శాంతి తదితరులు పాల్గొన్నారు.